Choice Based Credit System

Choice Based Credit System

దేశంలోని విశ్వవిద్యాలయాలను, కళాశాలలను మదింపుచేసే నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌ సూచనలమేరకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం బి.ఎఫ్.ఎ., బి.డిజైన్, బి.ఎల్.ఐ.ఎస్.సి., ఎం.ఎఫ్.ఎ., ఎం.ఎ., ఎం.పి.ఎ., ఎం.ఎ.సి.జె. ప్రొగ్రామ్‌లలో ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ను అమలు పరుస్తున్నది. ఈ విద్యాసంవత్సరంలో ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ను పూర్తి స్థాయిలో కాకుండా అందులోని మౌలిక అంశాలను తీసుకొని ఆయా ప్రొగ్రామ్‌ల సిలబస్‌లను రూపొందించడం జరిగింది.

ఈ విధానం ద్వారా తనకు ఆసక్తి, అభిరుచి ఉన్న ప్రొగ్రాంలను, తన అభివృద్ధికి అవకాశం ఉంటుందని భావించే కోర్సులను ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ విద్యార్థికి కల్పించడం జరుగుతుంది. విద్యార్థి తను చేరిన సబ్జక్టునుంచి మాత్రమే కాకుండా విశ్వవిద్యాలయంలోని ఇతర శాఖలు అందించే సబ్జక్టులనుంచి కూడా కొన్ని కోర్సులను ఎంచుకొని చేయవచ్చు.

2014-15 విద్యాసంవత్సరం నుండి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించే ఎం.ఎ., ఎం.పి.ఎ., ప్రోగ్రామ్‌లలో ప్రవేశపెట్టిన ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ కింది విధంగా ఉంటుంది.

  1. ప్రతి సెమిస్టర్‌లో విద్యార్థి అభ్యసిస్తున్న సబ్జక్టుకు సంబంధించిన ప్రోగ్రామ్‌నుంచి 5 కోర్సులు, ఇతర సబ్జక్టులనుంచి 1 కోర్సు కలిపి మొత్తం 6 కోర్సులను చదవవలసి ఉంటుంది.
  2. ప్రతి సెమిస్టర్‌లో విద్యార్థి ప్రవేశం పొందిన ప్రోగ్రామ్‌లో ఆయా శాఖలు 6 కోర్సులను బోధించడం జరుగుతుంది. మొదటి 4 కోర్సులు విద్యార్థులందరూ తప్పనిసరిగా తీసుకోవలసి ఉంటుంది. శాఖ ఆఫర్‌ చేస్తున్న 5, 6 కోర్సుల నుంచి ఏదైనా ఒక కోర్సును తన అభిరుచిమేరకు ఎంచుకొనే అవకాశం విద్యార్థికి ఉంటుంది. అంటే మొత్తంగా తన సబ్జక్టులో విద్యార్థి ఒక సెమిస్టర్‌లో 5 కోర్సులు తీసుకుంటాడు.
  3. 6 వ కోర్సు తన సబ్జక్టుకు సంబంధించి కాకుండా ఇతర శాఖలు అందించే ఏదైనా కోర్సును విద్యార్థి తీసుకోవలసి ఉంటుంది.
  4. ఈ విద్యాసంవత్సరంలో ఎం.ఎ., ఎం.పి.ఎ., ప్రోగ్రామ్ లలో ప్రవేశం పొందుతున్న విద్యార్థులందరూ మొదటి సెమిస్టర్‌లో 6 వ కోర్సుగా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులందరూ కంప్యూటర్‌ సెల్‌ ద్వారా అందించే ‘కంప్యూటర్‌ అప్లికేషన్స్‌’ కోర్సును తీసుకోవలసి ఉంటుంది.
  5. రెండవ సెమిస్టర్‌లో 6 వ కోర్సుగా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులందరూ భాషలు అనువాద అధ్యయన కేంద్రం ద్వారా అందించే ‘కమ్యూనికేషన్‌ స్కిల్స్‌’ కోర్సును తీసుకోవలసి ఉంటుంది.
  6. ప్రతి సెమిస్టర్‌లో విద్యార్థి మూడు కోర్సులు ఒక్కొక్కటి 4 క్రెడిట్‌లవి, రెండు కోర్సులు ఒక్కొక్కటి 3 క్రెడిట్‌లవి, ఒక కోర్సు రెండు క్రెడిట్‌లది కలిపి మొత్తం 20 క్రెడిట్‌లు సంపాదించుకోవలసి ఉంటుంది. సిద్ధాంతం కోర్సుకు ఒక క్రెడిట్‌కు వారంలో ఒక గంట బోధన ఉంటుంది. ప్రాయోగికం కోర్సుకు ఒక క్రెడిట్ వారంలో ఒక గంటన్నర బోధన ఉంటుంది.