Mode of Admission

Admission Process

ప్రవేశ పద్ధతి

  1. పూర్తికాలిక (రెగ్యులర్) ప్రొగ్రాంలలో ప్రవేశం నిమిత్తం ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈప్రవేశ పరీక్షలో 100 మార్కులకు బహుళ ఐచ్చిక ప్రశ్నలు (Multiple choice)  పరీక్ష ఉంటుంది. కానీ ప్రదర్శనా కళల ప్రొగ్రాంలలో (అంటే లలితకళాపీఠంలోని ప్రొగ్రాంలలో) ప్రవేశ పరీక్ష సిద్ధాంతానికి 50 మార్కులు, ప్రాయోగికానికి    50 మార్కులతో ఉంటుంది.
  1. నిర్ణీత సీట్ల సంఖ్య కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన ప్రొగ్రాంలకు ప్రవేశ పరీక్ష లేకుండానే మార్కు ప్రతిపాదిక ఆధారంగా ప్రవేశం కల్పించడం జరుగుతుంది.
  1. సాయంకాలం ప్రొగ్రాంలన్నింటికీ మౌఖిక పరీక్ష ద్వారా ప్రవేశం కల్పించడం జరుగుతుంది.
  2. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు జరుగుతాయి. అన్ని ప్రొగ్రాంలలో ప్రవేశానికి కనీసం 36 శాతం (ఎస్‌.సి./ఎస్‌.టి./వికలాంగ అభ్యర్థులకు 15 శాతం) మార్కులు పొందిన అభ్యర్థులు అర్హులు. ప్రదర్శన కళల ప్రొగ్రాంలలో సిద్ధాంతం, ప్రాయోగికం పరీక్షల్లో విడివిడిగా కనీస నిర్ణీత అర్హత మార్కులు 18+18 (ఎస్‌.సి./ఎస్‌.టి./వికలాంగ అభ్యర్థులకు 7.5+7.5) పొందిన వారే ప్రవేశానికి అర్హులవుతారు.
  3. సాయంకాలం ప్రొగ్రాంలలో పదిహేను మంది కంటే తక్కువమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నట్లయితే ఆ ప్రొగ్రాం నిర్వహించడం వీలుపడదు. దరఖాస్తు రుసుము వాపసు ఇవ్వబడదు.
  4. ఏ విశ్వవిద్యాలయం నుంచైనా ఒక ప్రొగ్రాం పూర్తి చేసిన వారు తిరిగి అదే ప్రొగ్రాంలో ప్రవేశానికి అర్హులుకారు.

 

దరఖాస్తు చేసుకునే పద్ధతి

2022-23 విద్యా సంవత్సరానికి విశ్వవిద్యాలయం నిర్వహించే బి.ఎఫ్.ఏ:-శిల్పం/చిత్రలేఖనం/ప్రింట్ మేకింగ్, ఎం.ఎఫ్.ఏ:-శిల్పం/చిత్రలేఖనం/ప్రింట్ మేకింగ్, బ్యాచులర్ ఆఫ్ డిజైన్ ఇన్ ప్రొడెక్ట్, బ్యాచులర్ ఆఫ్ డిజైన్ ఇన్ ఇంటీరియర్, బ్యాచులర్ ఆఫ్ డిజైన్ ఇన్ విజ్యువల్ కమ్యూనికేషన్, బ్యాచులర్ ఆఫ్ లైబ్రరరీ సైన్స్,  ఎం.ఏ. హిస్టరి, కల్చర్ & టూరిజం, ఎం.ఏ. అనువర్తిత భాషాశాస్త్రం, ఎం.ఏ. కమ్యూనికేషన్ & జర్నలిజం, ఎం.ఏ. జ్యోతిషం, ఎం.ఏ కర్ణాటక సంగీతం, (గాత్రం/మృదంగం/వీణ/ వయోలిన్),  ఎం.పి.ఏ.కూచిపూడి నృత్యం/ఆంధ్రనాట్యం, ఎం.పి.ఏ. రంగస్థల కళలు, ఎం.పి.ఎ.జానపద కళలు, ఎం.ఏ.తెలుగు (హైదరాబాదు, రాజమండ్రి ప్రాంగణం), ఎం.ఏ.చరిత్ర, పురావస్తు శాస్త్రం (శ్రీశైలం ప్రాంగణం), ఎం.పి.ఏ. కూచిపూడి నృత్యం (కూచిపూడి ప్రాంగణం), వివిధ పి.జి.డిప్లొమా, డిప్లామా, సర్టిఫికెట్ ప్రొగ్రాంలలో ప్రవేశం కోసం ఆన్ లైన్ ద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడమైంది. పూర్తి వివరాలను ఈ వెబ్ సైట్లలో ఉంచడమైంది. www.teluguuniversity & www.pstucet.org  ఈ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి.

ప్రవేశ పరీక్షా కేంద్రాలు

  1. హైదరాబాద్,
  2. వరంగల్,
  3. రాజమండ్రి,
  4. శ్రీశైలం,
  5. కూచిపూడిల్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయా ప్రాంగణాలలోని ప్రొగ్రాంలకు ప్రవేశ పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది.