Re-Admissions

పునఃప్రవేశం (రీ-అడ్మిషన్)

ప్రవేశం పొంది ప్రొగ్రాంలో మధ్యలో ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్ తీసుకునిగాని / తీసుకోకుండా గాని విశ్వవిద్యాలయం వదలి వెళ్ళిన వారు నిబంధనల మేరకు రెండవ / మూడవ / నాల్గవ సంవత్సరంలోకి అర్హత పొంది, కారణాంతరాల వల్ల కంటిన్యూ చేయనట్లయితే కోర్సు కాలపరిమితికి రెట్టింపు కాలపరిమితిలోగా కోర్సు పూర్తి చేసే విధంగా తిరిగి ప్రవేశం కల్పించవచ్చు. (టి.సి. తీసుకొని వెళ్ళినవారు అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, టి.సి. తీసుకోని వారు కేవలం ట్యూషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.) యు.జి మరియు పి.జి. ప్రొగ్రాంలు చేసే విద్యార్థులు ప్రథమ సంవత్సరం మధ్యలోనే డిస్‌కంటిన్యూ చేసినట్లయితే ఆ తదుపరి సంవత్సరంలో మాత్రమే, మరల ప్రవేశపరీక్ష లేకుండా ప్రవేశం పొందడానికి అర్హత ఉంటుంది. సంబంధిత ఫీజులు మొత్తం మరల చెల్లించవలసి ఉంటుంది. వారికి ఉపకార వేతనం పొందే అర్హత ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటుంది.