Admissions

Admissions

పూర్తికాలిక ప్రొగ్రాంలు హైదరాబాదు ప్రాంగణం

[wpdatatable id=1]
[wpdatatable id=2]
[wpdatatable id=3]
[wpdatatable id=4]
[wpdatatable id=5]
[wpdatatable id=6]
[wpdatatable id=7]

నన్నయ ప్రాంగణం : రాజమండ్రి

[wpdatatable id=8]

పాల్కురికి సోమనాథ ప్రాంగణం : శ్రీశైలం

[wpdatatable id=9]

శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠం : కూచిపూడి

[wpdatatable id=10]

అదనపు సీట్లు

విశ్వవిద్యాలయం నిర్వహించే యు.జి మరియు పి.జి. ప్రొగ్రాంలు, పి.జి. డిప్లొమా ప్రొగ్రాంలలో నిర్దేశించిన సీట్లకు అదనంగా 2 సీట్లు ఈ కింద సూచించిన అభ్యర్థులకు యు.జి.సి., ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రాధాన్యతా క్రమంలో కేటాయించడమవుతుంది.

  1. మాజీ సైనికుల పిల్లలకు, సైనికుల పిల్లలకు
  2. స్పోర్ట్స్ / ఎన్.సి.సి./ ఎన్. ఎస్. ఎస్. సర్టిఫికెట్లు పొందిన వారికి.

 పైన సూచించిన కోటాలో సీట్లు పొంద గోరేవారు తాము ఏ కేటగిరిలో సీట్లు పొందగోరుతున్నారో దానికి సంబంధించిన పూర్తి వివరాలు దరఖాస్తులో సూచించి, అందుకు సంబంధించిన సర్టిఫికెట్ల నకలు ప్రతులు దరఖాస్తుకు జతపరచాలి.

గమనిక :  APSCHE వారి లేఖ నం. APSCHE/UM-738/Committ.NI.Quota/Rajbhavan/2006,      

  1. 9.3.2006 ప్రకారం జాతీయ సమైక్యతా కోటా (National Integration Quota) కింద ఇతర రాష్ట్రాల విద్యార్థులకు విశ్వవిద్యాలయంలోని అన్ని రెగ్యులర్ ప్రొగ్రాంలలో 5 శాతం సీట్లు అదనంగా(Supernumerary Seats)కేటాయించడమవుతుంది. వీరు రెగ్యులర్ ప్రొగ్రాంలకు విద్యార్థులు చెల్లిస్తున్న రేట్ల ప్రకారం ఫీజులు చెల్లించాలి.

 

ప్రవాసాంధ్రులకు సీట్ల కేటాయింపు

యు.జి. ప్రొగ్రాంలలో రాష్ట్రేతరాంధ్రులకు రెండు సీట్లు, విదేశాంధ్రులకు రెండు సీట్లు; పి.జి. ప్రొగ్రాంలలో రాష్ట్రేతరాంధ్రులకు నాలుగు సీట్లు, విదేశాంధ్రులకు నాలుగు సీట్లు సూపర్ న్యూమరరీ కోటా కింద కేటాయించబడతాయి.

అండర్ గ్రాడ్యుయేషన్ ప్రొగ్రాంలలో చేరిన విద్యార్థులకు నెలకు రూ. 400/-ల చొప్పున, పి.జి. కోర్సుల్లో చేరిన విద్యార్థులకు నెలకు రూ. 500/-ల చొప్పున స్టయిఫండ్ చెల్లించడం జరుగుతుంది. విదేశాంధ్ర విద్యార్థుల ప్రవేశం విషయంలో ఆయా దేశాల ప్రభుత్వాలు స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది.

రిజర్వేషన్లు

మహిళలకు మొత్తం సీట్లలో 33 1/3 శాతం సీట్లు కేటాయించడమవుతుంది. ప్రతి క్యాటగిరీలోని మొత్తం సీట్లలో మహిళలకు ఈ కేటాయింపు వర్తిస్తుంది. ఎస్.సి., ఎస్.టి., బి.సి., వికలాంగులకు ఈ కింద తెలిపిన ప్రకారం సీట్లు కేటాయించడ మవుతుంది.

ఎస్.సి. – 15 శాతం
ఎస్.టి. – 6 శాతం
బి.సి. – 25 శాతం (గ్రూప్ – ఎ – 7 శాతం, గ్రూప్ – బి – 10 శాతం, గ్రూప్ – సి – 1 శాతం, గ్రూప్ – డి – 7 శాతం)
బి.సి. గ్రూప్ – ఇ (ముస్లింలు) – 4 శాతం (కోర్టు ఉత్తర్వులకు లోబడి)
వికలాంగులకు – 5 శాతం

E.W.S. – 10%