గమనిక :
1 ఎం.ఫిల్ ప్రొగ్రాంకు కాలపరిమితి ఒక సంవత్సరం. ప్రవేశం పొందిన కాలం నుండి ఒక సంవత్సరం పూర్తి అయిన వెంటనే పొడిగింపు కాలానికి అభ్యర్దిస్తూ, ఆ విద్యా సంవత్సరం ట్యూషన్ ఫీజు చెల్లించవలసివుటుంది.
గమనిక :
1.రెండు, మూడు మరియు నాల్గవ సంవత్సరానికి పూర్తికాలిక అభ్యర్థులు రూ. 11,000/-ల చొప్పున, అంశకాలిక అభ్యర్థులు రూ. 14,000/-ల చొప్పున ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజు చెల్లించాలి. అయిదవ సంవత్సరం నుండి పొడిగింపు కాలానికి ఆయా విద్యా సంవత్సరాలకు సంబంధించిన ట్యూషన్ ఫీజులు చెల్లించాలి.
2.i) విదేశీ విద్యార్థులకు మొదటి సంవత్సరానికి ఫీజు 1200 అమెరికన్ డాలర్లు
ii) రెండవ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరానికి ఫీజు 1200 అమెరికన్ డాలర్లు.
3.పరిశోధనాంశం సవరణ లేదా సిద్ధాంత వ్యాసం శీర్షిక సవరణ ఫీజు రూ. 1000/-
4.పిహెచ్.డి. రీ-రిజిస్ట్రేషన్ ఫీజు రూ.5,000/-లు తో పాటు ఆయా విద్యా సంవత్సరాల ట్యూషన్ ఫీజు చెల్లించవలసివుంటుంది.
1.జానపద సంగీతం / జానపద నృత్యం / జానపద వాద్యం ( 6 నెలల సర్టిఫికెట్ కోర్సులు) ఫీజు: రూ.1200/-లు
2.శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠం – కూచిపూడి. సర్టిఫికెట్ (నాలుగు సంవత్సరాలు), కూచిపూడి డిప్లొమా(రెండు సంవత్సరాలు) ఫీజు : రూ. 550/-లు (సంవత్సరానికి)
రెండు, మూడు, నాలుగవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు నిర్దేశించిన తేదీలోగా ట్యూషన్ ఫీజు మొత్తం ఒకే విడతలో చెల్లించాలి. చెల్లించలేనట్లయితే చెల్లించవలసిన చివరి తేదీ తర్వాత 15 రోజుల లోపల రూ.200/-ల ఆలస్య రుసుముతో ట్యూషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. లేని యెడల ప్రవేశం రద్దవుతుంది.
గమనిక :
1.విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులకు విజ్ఞాన విహారయాత్రలకు సంబంధించి విశ్వవిద్యాలయం ఏ విధమైన ఖర్చు భరించదు. ఆయా ప్రొగ్రాంల పాఠ్యాంశాలలో భాగంగా విద్యార్థులు విజ్ఞాన యాత్రలకు వెళ్ళవలసి వచ్చినట్లయితే ఆ ఖర్చులను విద్యార్థులే స్వయంగా భరించుకోవలసి ఉంటుంది.
2.విద్యార్థి తన గుర్తింపు కార్డును పోగొట్టుకొన్నట్లయితే తగిన కారణాలను వివరిస్తూ డూప్లికేట్ గుర్తింపు కార్డు కోరుతూ అభ్యర్థన లేఖతో పాటు రూ.100/-లకు ‘రిజిస్ట్రార్’ పేరు మీద తీసిన డి.డి.ని జతపరచి సంబంధిత శాఖాధిపతి సిఫారసుతో పీఠాధిపతికి సమర్పించి డూప్లికేటు కార్డు పొందవలసి ఉంటుంది.