Hostels
విద్యార్థి వసతి గృహాలు (హాస్టళ్ళు)
విశ్వవిద్యాలయానికి హైదరాబాదు, శ్రీశైలం, రాజమండ్రి, కూచిపూడి ప్రాంగణాలలో హాస్టళ్ళు ఉన్నాయి. హైదరాబాదు ప్రాంగణంలో యు.జి., పి.జి ప్రొగ్రాంలలో చేరే విద్యార్థులకు బాచుపల్లి హాస్టల్లో మాత్రమే వసతి సౌకర్యం కల్పించబడుతుంది. ఈ హాస్టళ్ళలో పరిమిత సంఖ్యలో మాత్రమే అభ్యర్థులకు వసతి కల్పించడం జరుగుతుంది. ప్రొగ్రాంలలో ప్రవేశం పొందిన ప్రతి అభ్యర్థికి హాస్టల్ వసతి కల్పించడం వీలుపడదు. అంశకాలిక ప్రొగ్రాంలు / సాయంకాల ప్రొగ్రాంలు/ పేమెంట్ సీట్లలో చేరే విద్యార్థులకు, విద్యార్థినులకు హాస్టల్ సౌకర్యం గానీ, బస్‌పాస్ సౌకర్యం గానీ ఉండదు. ఉద్యోగం చేస్తున్న విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం ఉండదు.
ప్రతి విద్యా సంవత్సరం ఆరంభం నుంచి ఆ విద్యాసంవత్సరం వార్షిక పరీక్షలు అయిపోయేవరకు మాత్రమే హాస్టల్ వసతి ఉంటుంది. వార్షిక పరీక్షలు అయిపోయిన తరువాత తదుపరి విద్యాసంవత్సరం ఆరంభం తేదీ వరకు హాస్టల్ మూసి వేయడమవుతుంది. విద్యార్థులకు మంజూరయ్యే ఉపకార వేతనం కంటే మెస్‌బిల్లు అధికం అయినట్లయితే అదనంగా అయిన మెస్‌బిల్లును విద్యార్థులు చెల్లించవలసి ఉంటుంది. ఆయా నెలల్లో మెస్‌బిల్లు వివరాలు నోటీసు బోర్డులో ఉంచడమౌతుంది. వారు వారంలోపుగా బిల్లు చెల్లించవలసి ఉంటుంది. అలా చెల్లించని వారికి హాస్టలు సౌకర్యం రద్దుచేయడమౌతుంది. ప్రతి నెల తరగతులకు 75శాతం కన్నా తక్కువ హాజరైన అభ్యర్థులకు హాస్టలు సౌకర్యం, ఉపకార వేతనాలు రద్దవుతాయి. గత సంవత్సరంలో స్కాలర్‌షిప్ ద్వారా మంజూరైన మొత్తం పోగా మిగిలిన బకాయిలు చెల్లించిన విద్యార్థులకు మాత్రమే తదుపరి సంవత్సరంలో హాస్టల్ వసతి కల్పించడమవుతుంది. పూర్తి బకాయిలు చెల్లించని విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వవిద్యాలయం ఎటువంటి సర్టిఫికెట్‌లను జారీచేయదు.
గమనిక :
- 2008-09 విద్యా సంవత్సరం నుంచి విశ్వవిద్యాలయ హాస్టల్‌ను విశ్వవిద్యాలయం నూతన ప్రాంగణం బాచుపల్లికి తరలించడమైంది. హాస్టల్ అడ్మిషన్స్ పొందే విద్యార్థులందరూ బాచుపల్లి హాస్టల్‌లోనే వసతి పొందవలసి ఉంటుంది.
- ఏ సమయంలోనైనా హాస్టల్ నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడితే హాస్టలు మూసి వేసే హక్కు విశ్వవిద్యాలయానికి ఉన్నది. హాస్టల్‌లో నివసించే విద్యార్థులు నిబంధనలకు అనుగుణంగా క్రమశిక్షణను పాటించవలసి ఉంటుంది. లేనట్లయితే అటువంటి వారిని హాస్టలు నుంచి తొలిగించే అధికారం విశ్వవిద్యాలయానికి ఉన్నది.
- విశ్వవిద్యాలయం హాస్టల్స్, విశ్వవిద్యాలయం గోడలపై మరియు తలుపులపై విద్యార్థులు ఎటువంటి వాల్‌పోస్టర్లను అతికించరాదు. నోటీసు బోర్డులపై మాత్రమే అతికించవచ్చు. విద్యార్థులు హాస్టల్‌లో కిరోసిన్/గ్యాస్/ఎలక్ట్రికల్ స్టౌలను ఉపయోగించరాదు మరియు ఇతర విద్యార్థులను రూములలోనికి అనుమతించరాదు. ఇటువంటి వారికి హాస్టల్ వసతిని మరియు అడ్మిషన్‌ను రద్దుచేయడం జరుగుతుంది.
- విద్యార్థులకు ఎలాంటి వైద్య ఖర్చులు విశ్వవిద్యాలయం చెల్లించదు.
- 2022-23 విద్యా సంవత్సరం నుండి తరగతులు బాచుపల్లి ప్రాంగణంలో జరుగుతాయి.
- బాచుపల్లి ప్రాంగణంలోనే విద్యార్థులు మరియు విద్యార్థినిలకు కూడా హాస్టల్స్ వసతి కల్పించడం జరుగుతుంది.