Scholarships

ఉపకార వేతనాలు

  1. విశ్వవిద్యాలయంలోని పూర్తికాలిక యు.జి., పి.జి., ఎం.ఫిల్ & పిహెచ్.డి. ప్రొగ్రాంలలోని బి.సి., ఎస్.సి., ఎస్.టి. అభ్యర్థులకు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ స్కాలర్‌షిప్‌లు  మంజూరు చేసే అవకాశం ఉంది. విశ్వవిద్యాలయంలోని పూర్తికాలిక ప్రొగ్రాంలలో సెల్ప్ సపొర్టింట్ సీట్లలో ప్రవేశం పొందిన బి.సి., ఎస్.సి., ఎస్.టి. అభ్యర్థులకు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ స్కాలర్‌షిప్‌లు మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవలసివుంటుంది. దరఖాస్తు చేసుకున్న వారికి కొంత మొత్తాన్ని మంజూరు చేసే అవకాశం ఉంటుంది.
  2. ఎస్.సి., ఎస్.టి., అభ్యర్థులకు – (తల్లిదండ్రుల, సంరక్షకుల సంవత్సరాదాయం రూ. 2.00లక్షల లోపు, బి.సి.లకు రూ. 1,00,000/-ల లోపు) కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ప్రవేశ సమయంలో సమర్పించిన మీదట బి.ఎఫ్.ఎ./ ఎం.ఎఫ్.ఎ/ఎం.ఎ. హిస్టరి, కల్చర్ & టూరిజం/ ఎం.ఎ/ ఎం.పి.ఎ./ఎం.సి.జె./ఎం.ఫిల్/పిహెచ్.డి. ప్రొగ్రాంలలో ప్రవేశం పొందిన అభ్యర్థులకు – పూర్తి ట్యూషను ఫీజు, స్పెషల్ ఫీజుల్లో మినహాయింపు ఉంటుంది. సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించని వారు పూర్తి ఫీజు చెల్లించి (వాపసు చేయడం వీలుపడదు) ప్రవేశం పొందాలి. ఒకసారి చెల్లించిన ఫీజు ఎట్టి పరిస్థితుల్లోనూ వాపసు చేయడం వీలుపడదు. ఎస్.సి., ఎస్.టి., బి.సి., ఇ.బి.సి. విద్యార్థులు స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకొన్నవారికి మాత్రమే ట్యూషన్ ఫీజు మంజూరయ్యే అవకాశం ఉంటుంది. అలా దరఖాస్తు చేసుకోని వారు ట్యూషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
  3.  ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇ.పి.పి. స్కాలర్‌షిప్ మంజూరు చేసినట్లయితే మొదటిసారి బి.ఎఫ్.ఏ/ ఎం.వి.ఏ/ఎం.ఏ. హిస్టరి, కల్చర్ & టూరిజం/ ఎం.ఏ./ ఎం.పి.ఏ./ఎంఏ..సి.జె/ ప్రొగ్రాంలలో చేరే విద్యార్థులకు మాత్రమే ఇ.పి.పి. స్కాలర్‌షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇతర విశ్వవిద్యాలయాల్లో ఇదివరకే గ్రాడ్యుయేట్/ పి.జి. ప్రొగ్రాంలు పూర్తి చేసి మరలా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించే అదే స్థాయి గ్రాడ్యుయేట్ / పి.జి. ప్రొగ్రాంలలో ప్రవేశించే విద్యార్థులకు ఇ.పి.పి. ఉపకార వేతనాలు మంజూరు చేయడం జరగదు. ఇతర కళాశాలల్లో గ్రాడ్యుయేట్ / పోస్టు గ్రాడ్యుయేట్ ప్రొగ్రాంలు మధ్యలో వదిలేసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తత్సమాన కోర్సులో చేరిన విద్యార్థులు గతంలోని ప్రొగ్రాంలకు వారు స్కాలర్‌షిప్ పొందలేదని సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ నుంచి సర్టిఫికెట్ పొంది, దానిని విశ్వవిద్యాలయానికి సమర్పించాలి. అలా సమర్పించనివిద్యార్థులకు స్కాలర్‌షిప్ మంజూరు కాదు.
  4.  రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అభ్యర్థుల వయోపరిమితికి లోబడి స్కాలర్‌షిప్ మంజూరు చేయడంజరుగుతుంది.

యూనివర్సిటీ రీసెర్చి ఫెలోషిప్ (URF)

  1. ఎం.ఫిల్. అభ్యర్థులకు ఏ విధమైన స్కాలర్ షిప్ రానివారికి శాఖకు ఇద్దరు చొప్పున మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి వారికి నెలకు1500 రూపాయలు చొప్పున ఫెలోషిప్ గానూ, సంవత్సరానికి 1000 రూపాయలు    కంటింజెన్సీ గ్రాంటుగానూ విశ్వవిద్యాలయం మంజూరు చేస్తుంది. అయితే వారు మరే ఇతర స్కాలర్ షిప్స్ లను పొందకూడదు.
  2. పిహెచ్.డి. అభ్యర్థులకు ఏ విధమైన స్కాలర్ షిప్ రాని వారికి శాఖకు నలుగురు చొప్పున మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి వారికి నెలకు2500 రూపాయలు చొప్పున ఫెలోషిప్ గానూ, సంవత్సరానికి 1500 రూపాయలు  కంటింజెన్సీ గ్రాంటుగానూ విశ్వవిద్యాలయం మంజూరు చేస్తుంది. అయితే వారు మరే ఇతర స్కాలర్ షిప్స్ లను పొందకూడదు.
  3. ప్రొగ్రాంలో చేరిన తేది నుండి ఎం.ఫిల్. విద్యార్థులకు 12 నెలల కాలానికి పిహెచ్.డి. విద్యార్థులకు 36 నెలల కాలానికి మాత్రమే విశ్వవిద్యాలయం ఫెలోషిప్ లు మంజూరు అవుతాయి
  4. ఇతర కళాశాలల్లో గ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు మధ్యలో వదిలేసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తత్సమాన కోర్సులో చేరిన విద్యార్థులు గతంలోని కోర్సులో వారు స్కాలర్ షిప్ పొందలేదని సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ నుంచి సర్టిఫికెట్ పొంది, దానిని విశ్వవిద్యాలయానికి సమర్పించాలి. అలా సమర్పించని విద్యార్థులకు స్కాలర్ షిప్ మంజూరు కాదు.